PAK-BAN: PAK vs BAN మ్యాచ్ వర్షార్పణం 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్థాన్ ఒక్క విజయం లేకుండా ముగించింది. నేడు జరగాల్సిన పాక్, బంగ్లా మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. గురువారం రావల్పిండిలో ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో మైదానమంతా చిత్తడిగా మారింది.ఔట్ ఫీల్డ్ మొత్తం జలమయం అవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయించారు.